
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా జన్మదిన కేక్ కట్ చేసి పలువురికి కేకలు, స్వీట్లు తినిపించారు. ఎమ్మెల్సీగా, టీపీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్ర అభివృద్ధిలో విశేషమైన సేవలందిస్తూ.. పార్టీని అధికారంలో తిరిగి నిలిపేందుకు కృషి చేస్తున్న మహేష్ కుమార్ గౌడ్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపాలిటీ చైర్పర్సన్ రొంటాల సుహాసిని, మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయ్ కుమార్ మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్, పట్టణ అధ్యక్షులు మేకల తిరుపతి, మహిళా మండల అధ్యక్షురాలు పుల్ల రాధ, కౌన్సిలర్స్, కో-ఆప్షన్ సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్స్, సోషల్ మీడియా కో ఆర్డినేటర్స్, యూత్ కాంగ్రెస్ నాయకులు, మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.







