
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (ఇల్లందకుంట): ఇల్లందకుంట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదినం సందర్భంగా స్థానిక శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి, తరువాత కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.


ఈ సందర్భంగా పెద్ది కుమార్ మాట్లాడుతూ
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన సందర్భంగా ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా సేవే లక్ష్యంగా నిరంతరం పార్టీ బలోపేతానికి, సామాన్య ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న మహేష్ కుమార్ గౌడ్ యువతకు ఆదర్శప్రాయ నాయకుడని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లడంలో ఆయన చేస్తున్న సేవలు విశేషమైనవి అని, పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, సమన్వయంతో ముందుకు నడిపించే నాయకత్వం ఆయన సొంతం అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, బీసీల సాధికారత మరియు సామాజిక న్యాయం కోసం ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.
ఆయన నిత్యం ప్రజా సేవలో నిమగ్నం కావాలని, ఆయనకు ఆయురారోగ్యాలు, మరిన్ని ఉన్నత పదవులు కలగాలని ఆకాంక్షిస్తూ, ప్రజా సేవలో మరింత ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని నాయకులు అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ ఉప్పుల శ్రీనివాస్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పెద్ది శివకుమార్, కాంగ్రెస్ నాయకులు కనుమల్ల సంపత్, ఎక్కిటి సంజీవరెడ్డి, సర్పంచులు కోరుకండ్ల శ్రీనివాస్, ఆరెల్లి రమేష్, బైరెడ్డి కొండల్ రెడ్డి, జిల్లెల్ల సందీప్ రెడ్డి, మర్రి వీరారెడ్డి, సింగిరెడ్డి గోపాల్ రెడ్డి, గైకోటి రాజు, దంసాని తిరుపతి, భోగం పృథ్వీరాజ్, ఆరే రమేష్ రెడ్డి, గూడపు ఓదెలు, మారపల్లి వేణు, కొత్తూరు రాజేందర్, జక్కు కుమార్, మారేపల్లి వంశీ, జలంధర్ రెడ్డి, ధార నరేష్, బోయిన్ విష్ణు తదితర నాయకులు, కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.





