
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్య పరిరక్షణ విషయంలో శ్రద్ధ వహించాలని హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని అన్నారు. సోమవారం
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా వారోత్సవాలను పురస్కరించుకొని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు రక్త పరీక్షలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ… తప్పనిసరిగా గర్భిణీ స్త్రీలు పరీక్షలు నిర్వహించు కోవాలన్నారు. డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి గర్భిణీ స్త్రీ అనీమియా రక్త పరీక్షలు చేయించుకోవాలని, హెచ్బి 8 ఉంటే ఐరన్ శుక్రోచ్ ఇంజక్షన్ తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నల్ల నారాయణరెడ్డి, హుజురాబాద్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ గొట్టే శ్రవణ్ కుమార్, సిడిపిఓ మరాఠీ సుగుణ, పల్లె దవాఖాన వైద్యాధికారిణి డాక్టర్ జరీనా, జిల్లా ఆరోగ్య బోధకులు ప్రతాప్ గౌడ్, సదానందం, సత్యం, విజయలక్ష్మి, ఐసిడిఎస్ సూపర్వైజర్ రమ్యరెడ్డి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.


మాట్లాడుతున్న మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని..

యువతులకు రక్త పరీక్ష నిర్వహిస్తున్న దృశ్యం..

ప్రతిజ్ఞ చేయిస్తున్న డిప్యూటీ డిఎం హెచ్ ఓ జి శ్రావణ్...





