
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్, మే 28: మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి, ఉమ్మడి రాష్ట్రాభివృద్ధికి చేసిన సేవలు చిరస్మరణీయమైనవని రైతు ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు.

ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న పోరాడి రామారావు.

స్వర్గీయ ఎన్టీఆర్ 103వ జయంతి సందర్బంగా గురువారం కరీంనగర్ బైపాస్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహానికి ఎన్టీఆర్ అభిమానులు, ప్రజా సంఘాల నాయకులతో కలిసి పోలాడి రామారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేకే కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. నిరంతరం పారిశుధ్య విధుల్లో నిమగ్నమై పర్యావరణహితానికి కృషి చేస్తున్న కార్మికులకు శాలువాలు కప్పి సన్మానించి స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు. తొలుత స్థానిక ప్రధాన హాస్పిటల్ లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.


అనంతరం పోలాడి రామారావు మాట్లాడుతూ వెండి తెరకు వన్నె తెచ్చిన,తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా నిలబెట్టిన గొప్ప యుగ పురుషుడుగా నందమూరి తారక రామారావును అభివర్ణించారు. పేదల పాలిట పెన్నిధిగా, రైతన్నల సంక్షేమ ప్రధాతగా, ఆడపడుచులకు అన్నగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు.ఆయన ఆశయాలను ప్రస్తుత టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు కొనసాగిస్తూ వస్తున్నారని తెలిపారు.

పలువురీని శాలువాలతో సత్కరిస్తున్న పోలాడి రామారావు. ఈ కార్యక్రమంలో రైతు ప్రజా సంఘాల జిల్లా అధ్యక్షుడు ఏనుగు చొక్కారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శి ఎర్రవెల్లి రవీందర్, జిల్లా ఉపాధ్యక్షులు నందవోయిన రాజేశం, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి ఎర్రవెళ్లి వినీత్, నాయకులు తాటికొండ శేఖర్, ఒడ్డె శ్రీనివాస్, సమ్మయ్యలతో పాటు ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, రైతు ప్రజా సంఘాల నాయకులు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి అందించిన సేవలపై వివరిస్తున్న పోలాడి రామారావు..





