Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ ప్రాంతంలో వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న జయన్న ఫౌండేషన్ చైర్మన్ గుడిపాటి జైపాల్ రెడ్డిని గురువారం బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… జైపాల్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడుగా కాకుండా సమాజంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ, పలువురికి చేతనందిస్తున్నాడని, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో మరింత మంది సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇంతే కాకుండా డిటిఎఫ్ నాయకులు పలకల ఈశ్వర్ రెడ్డి, బీసీ నాయకులు అమరేందర్ లను సైతం సన్మానించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ ఆడెపు సురేందర్, రిటైర్డ్ హెచ్ఎం వేల్పుల రత్నం, బీసీ జెఎసి అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, పూలే కమిటీ చైర్మన్ చల్లూరి రఘుచారి, గొర్రె చిరంజీవి, సందెల వెంకన్న, కండె తిరుపతి, బొడిగ మల్లయ్య, అంబాల రవీందర్, ప్రవీణ్, మేకల మల్లేష్, రవీందర్, కొలిపాక క్రాంతి తదితరులు పాల్గొన్నారు.





