
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్ పర్సన్ ఆర్ సుహాసిని ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్థానికులకు తినిపించి, శ్రీధర్ బాబు నిండా నూరేళ్లు జన్మించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ మేకల తిరుపతి, మండల ప్రెసిడెంట్ కిరణ్ కుమార్, మహిళా మండల ప్రెసిడెంట్ రాధా, మాజీ చైర్మన్ విజయ్ కుమార్, వార్డు కౌన్సిలర్స్, కో ఆప్షన్ మెంబర్స్, సోషల్ మీడియా ఇంచార్జ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు..





