Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో శనివారం తెల్లవారుజామున నవజాత శిశువు మృతి చెందింది. వివరాలలోకి వెళితే..సైదాపూర్ మండలం రాయికల్ గ్రామానికి చెందిన రమ్య అనే గర్భిణీ స్త్రీ ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చింది. ఆమెకు శుక్రవారం శస్త్ర చికిత్స ద్వారా వైద్యులు డెలివరీ చేశారు. ప్రసవం తర్వాత బాగానే ఉన్నా నవజాత శిశువు శనివారం తెల్లవారుజామున ఎలాంటి కదలిక లేకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వైద్యులకు తెలుపగా వారు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. నవజాత శిశువు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఒక్కరోజులోనే నవజాత శిశువు మృతి చెందడం పట్ల రమ్య కుటుంబ సభ్యులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న హుజురాబాద్ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ నల్ల నారాయణరెడ్డి నవజాత శిశువు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి మృతికి కారణాలను అంతర్గత విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఏది ఏమైనప్పటికి ఇటీవల వరుసగా ఏరియా ఆసుపత్రిలో శిశువుల మృతి చెందుతుండడంతో ఆసుపత్రి పనితీరుపై పలు విమర్శలకు తావిస్తుంది.





