
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జూనియర్ సివిల్ జడ్జి బత్తుల మానస ను బుధవారం నాడు ..సీనియర్ ప్రజాప్రతినిధి తక్కలపల్లి రాజేశ్వర్ రావు మరియు ఐఎంఎ వైద్యులు.. హుజురాబాద్ లోనీ ఆమె నివాసంలో జడ్జి మానసను మర్యాద పూర్వకంగా కలసి శాలువాతో సన్మానించారు.
ఈసందర్భంగా ప్రజాప్రతినిధి తక్కళ్ళపల్లి రాజేశ్వరరావు, ఐఎంఎ వైద్యులు డా.రామలింగారెడ్డి
ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండిటెంట డా. నల్ల నారాయణరెడ్డిలు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణించాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ స్ఫూర్తితో మహిళలు ముందుకు పోవాలనీ సూచించారు. డా అంబేద్కర్ భారత రాజ్యాంగంలో మహిళలకు అనేక అంశాలలో చట్ట బద్ధత కల్పించారని అన్నారు. చట్టసభలలో, ఉద్యోగ అవకాశాలలో రాజ్యాంగంలో పొందు పరిచిన అంశాలను వినియోగించుకొని మహిళ లోకం ముందుకు సాగుతుందని అభిప్రాయ పడ్డారు. ఇందుకు జడ్జిగా ఎంపికైన మానసను ఉదాహరణగా చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మానసను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ సూపరిండిటెంట్ డా. నల్ల నారాయరెడ్డి, వైద్యులు రామలింగారెడ్డి, డా.నాగలింగం, తోగరు విద్యాసాగర్, పిల్లల వైద్య నిపుణులు భాస్కర్, డా,ప్రదీప్ రావులతో పాటు దంపతులు మనోజ్- ఉమాదేవి, మురికి అనిత – గౌరీశంకర్, తూము వెంకటరెడ్డి, ముక్కెర కనకయ్య, రావుల దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జూనియర్ జడ్జి మానసను సన్మానిస్తున్న ఐఎంఎ వైద్యులు






