Oplus_16908288
—నభూతో న భవిష్యత్ తరహాలో లక్షలాది మందితో కరీంనగర్ లో రైతుల మహాగర్జన సమరభేరి…
—రైతు ప్రజా సంఘాల జేఏసీ.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్(హైదరాబాద్):
ఇచ్చిన హామీల అమలులో పాలకుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ, డిమాండ్ల సాధనకు నిర్వహించే రైతుల సమరభేరికి సర్వం సిద్ధం చేసి, ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రైతు ప్రజా సంఘాల జేఏసీ నేతలు పోలాడి రామారావు, గోపు జిపాల్ రెడ్డి, మహంకాళి రాజన్న, వణ్యాల భూపతిరెడ్డి, రాయపాటి వెంకటేశ్వర్ రావులు వెల్లడించారు.

అభివాదం చేస్తున్న రైతు ప్రజా సంఘాల జేఏసీ నేతలు పోలాడి రామారావు, తో పాటు రాష్ట్ర జిల్లాల ప్రతినిధులు.
ఇచ్చిన హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఈ సభ ద్వారా ఎండ గడుతామని వివరించారు. శనివారం హైదరాబాద్ లో నిర్వహించిన రాష్ట్ర, జిల్లాల ఐకాస ప్రతినిధుల సమావేశంలో వారు మాట్లాడుతూ జూన్ 14న సాయంత్రం 4 గంటలకు కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ కాలేజీ గ్రౌండ్ లో లక్షలాది మందితో నిర్వహించే రాష్ట్రస్థాయి రైతుల మహాగర్జన సమరభేరికి రెండు వేల అయిదు వందల బస్సుల్లో, వివిధ వాహనాల్లో వివిధ మార్గాల్లో అన్ని జిల్లాల నుంచి తరలి రావడానికి రైతులు స్వచ్చందంగా ఏర్పాట్లు చేసుకున్నారన్నారు. 5 వేల మంది మహిళల కోలాటాల బృందంలు, రెండు వేల డప్పు కళాకారులు ర్యాలీగా సభకు తరలి వస్తున్నట్లు చెప్పారు. సభాస్థలి వేదిక, లౌడ్ స్పీకర్లు, 25 వేల కుర్చీలు,10 ఎకరాల చుట్టూ ఇరువైపులా భారీ కేడ్లు, ఎల్ ఈడి తెరలు ఏర్పాటుకు జిల్లాకు చెందిన తాజా, మాజీ ప్రజా ప్రతినిధుల సహకారం మరువలేనిదన్నారు. సభకు వచ్చే రైతులకు లక్ష మజ్జిగ పాకెట్లు, 60 వేల పులిహోర పొట్లాలు, 60 వేల మినరల్ వాటర్ బాటిళ్లను వివిధ డైరీ యాజమాన్యాలు స్వచ్చందంగా సమాకూర్చుతున్నారని అందుకు ప్రజా సంఘాల తరపున పోలాడి రామారావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వేదికకు ఎడమ ప్రక్కన తెలంగాణ ఉద్యమ గాయకుడు సందీప్ ఆధ్వర్యంలో 100 మంది బృందం తో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. సభా వేదిక నుంచి నలువైపులా 20 km వరకు ఆర్చిలతో సహా ప్రధాన కూడళ్లలో తోరణాలతో అలంకరన చేస్తున్నామన్నారు. వివిధ జిల్లాలు వరంగల్ నుంచి వచ్చే వారికి కిట్స్ సింగాపూర్ లో, సిరిసిల్ల, కామరెడ్డి రూట్ లో కొదురుపాక వద్ద, ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ నుంచి వచ్చే వారికీ ధర్మారంలో, జగిత్యాల రూట్ లో వచ్చే వారికీ గంగాధర క్రాస్ లో మంచిర్యాల, గోదావరిఖని, పెద్దపల్లి రూట్లో వచ్చే వారికీ సుల్తానాబాద్ లో సిద్దిపేట రూట్లో వచ్చే వారికీ శనిగరం లో, హుస్నాబాద్ రూట్ లో వచ్చే వారికీ ఎల్కతుర్తిలో భోజన వసతి, మజ్జిగ, మంచినీటి సౌకర్యం విశ్రాంతి కేంద్రాలను వాలంటీర్స్ తో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమావేశ ప్రాంగణంలో 800 మందితో వాలంటీర్లతో బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సభా స్థలి ప్రాంగణం క్రిక్కిరిసే అవకాశం మున్నందున నగరంలోని ఆరు ప్రధాన కూడల్లలో దాతల సహకారంతో బిగ్ ఎల్ ఈడి తెరలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సభకు అంచనాలకు మించి రెండు లక్షలకు పైగా ప్రజలు సమరభేరికి హాజరు కానున్నట్లు తెలిపారు. సభకు అన్ని పార్టీల నాయకులను ఆహ్వాణించామని తన్నీరు హరీష్ రావు, ఈటల రాజేందర్, కల్వకుంట్ల కవిత, చాడ వెంకట్ రెడ్డి, జాన్ వెస్లీ, చలపతిరావు లతో పాటు ఆర్ కృష్ణయ్య, మందకృష్ణమాదిగ, పోల్సాని సుగుణాకర్ రావు, రవీందర్ సింగ్, పెండ్యాల కేశవరెడ్డి, కోదండ రాం రెడ్డి, ఆరుణోదయ విమలక్క, సంధ్య, అమరవాది లక్ష్మీ నారాయణ, అజ్మీరానాయక్ తదితరులు హాజరయ్యే ఈ సమావేశనికి వివిధ వర్గాల వారు రైతులు పార్టీల కతీతంగా పెద్ద ఎత్తున హాజరై సమరభేరికి హాజరై విజయవంతం చేయాలని ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర ఉమ్మడి జిల్లా నాయకులు పిలుపునిచ్చారు.





