
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: నియోజకవర్గంలోని పేద, మధ్య తరగతి ప్రజలకు, అన్నార్తులకు అండగా ఉంటానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శనివారం హుజురాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో, మండలంలోని వీడి దగ్గర గ్రామాలలోని లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఏ ఆరోగ్య సమస్య కోసం ఆసుపత్రులకు వెళ్లిన వారు దరఖాస్తు చేసుకున్న వాటిని వెంటనే మంజూరు అయ్యేలా కృషి చేస్తున్నానని తెలిపారు. అంతేకాకుండా నియోజకవర్గంలోని ప్రజలకు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకొని రావాలని ఆయన కోరారు. ఎలాంటి సమస్య అయినా నేరుగా తన వద్దకు గాని గ్రామ పట్టణ బి ఆర్ ఎస్ నాయకులతో గాని తనకు తెలియజేయవచ్చని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నానని అన్నారు. పట్టణంలోని గాంధీనగర్ ప్రతాపవాడ, బోర్నపల్లి, దమ్మక్కపేట, కుమ్మరివాడ తదితర వార్డులతోపాటు మండలంలోని కాట్రపల్లి, పెద్దపాపయ్యపల్లి, కందుగుల, ధర్మరాజుపల్లి, జూపాక, చెల్పూర్, రంగాపూర్, పోతిరెడ్డిపేట గ్రామాలలో లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.


మూడవ వార్డులో ప్రజలను పలకరిస్తూ.. యోగ క్షేమాలు అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పట్టణ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, కౌన్సిలర్లు గందె శ్రీనివాస్, ప్రతాప తారా తిరుమల్ రెడ్డి, కేసిరెడ్డి లావణ్య నరసింహారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు బండ శ్రీనివాస్ సింగిల్ విండో చైర్మన్ ఎడవల్లి కొండల్ రెడ్డి, ఇరుమల్ల సురేందర్ రెడ్డి, పీ దయాకర్ రెడ్డి, కత్తుల రాజు, ఐలయ్య, కిరణ్, బిక్షపతి, శివకృష్ణ, కుంట తిరుపతిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, వెంట ఉన్న ప్రజా ప్రతినిధులు, నాయకులు..





