మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ ప్రెస్ క్లబ్ కన్వీనర్ గా ఆంధ్రజ్యోతి ఆర్ సి ఇంచార్జ్ గడ్డం ధర్మారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం పట్టణంలోని మధువాని గార్డెన్ లో హుజురాబాద్ ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గత పాలకవర్గాన్ని రద్దు చేయడంతో పాటు నూతనంగా ఆడహక్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కమిటీలో కో- కన్వీనర్లుగా కాయిత రాములు, నిమ్మటూరి సాయికృష్ణ, సభ్యులుగా పత్తి విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీధర్, వేల్పుల సునీల్, పోతారాజ్ సంపత్, చట్టంపల్లి సృజన్, శ్రీనివాస్, చిలుకమారి సత్యరాజ్, మచ్చిక చందులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు మామిడి రవీందర్, తిరునగరి ఆంజనేయస్వామి, కోరం సుధాకర్ రెడ్డి, కేసిరెడ్డి నరసింహారెడ్డి, పరాంకుశం కిరణ్ కుమార్ తో పాటు ఇతర ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

