తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా కలెక్టర్లకు మంత్రి పొన్నం ఆదేశం
-ప్రభుత్వం అండగా ఉంటుంది
-టిపిసిసి హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి మిడిదొడ్డి రాజు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట నష్టపోయిన రైతులు ఎవరు ఆందోళన చెందవద్దు అని సర్కారు అండగా ఉంటుంది అని “హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి మిడిదొడ్డి రాజు” తెలిపారు..
ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ కలెక్టర్ కు మంత్రి పోన్నం ప్రభాకర్ లేఖ రాసినారు రైతులు ఎవరు అధైర్య పడొద్దు అని పేర్కొన్నారు… కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రైతుల పక్షపాతి అని తెలియజేయడం జరుగుతుంది ఏటువంటి సమస్యలు ఉన్న ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలన్నారు..
