మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణంలోని కాకతీయ కాలనీ చెందిన అల్లి మహేందర్(58) ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం. పట్టణంలోని కాకతీయకాలనీకి చెందిన అల్లి మహేందర్ శనివారం రాత్రి చాతిలో నొప్పి రావడంతో హనుమకొండలోని ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డాడు. మృతునికి భార్య సునీత, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె కలరు. ఎంతో సౌమ్యుడిగా పేరుందిన మహేందర్ అకస్మాత్తుగా మృతి చెందడంతో ఆయన మరణ వార్త విని నియోజకవర్గంలోని ఎల్ఐసి ఏజెంట్లు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రగాఢ సానుభూతి సంతాపమును తెలియజేశారు. సాయంత్రం స్వగ్రామ హుజురాబాద్ లో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.
