మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ :
ప్రభుత్వ పాఠశాలను పటిష్టం చేయాలని, కార్పొరేట్ విద్యా వ్యవస్థను రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు పొడిశెట్టి అభిలాష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలను కల్పించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేట్ విద్యా సంస్థలైన నారాయణ,శ్రీ చైతన్య లాంటి పాఠశాలను పూర్తి రద్దు చేయాలని, విద్యార్థుల తల్లిదండ్రులను ఫీజుల పేరుతో దోపిడీ గురి చేసి, ఈ టెక్నో, కరిక్యులమ్, ఐపియల్, ఒలింపియాడ్ అంటూ పలు పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్న పాఠశాల పై చర్యలు తీసుకోవాలని కోరారు.గత బిఆర్ఎస్ పాలనలో విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురయ్యారని, ఇప్పుడు ఉన్న ప్రభుత్వమైన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని అన్నారు. ఫీజుల పేరుతో దోపిడీ చేస్తున్నా ఆయా పాఠశాల పై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఫీట్ నెస్ లేని పాఠశాల బస్సులను అధికారులు సీజ్ చేసి కేసు బుక్ చేయాలని డిమాండ్ చేశారు.ప్రతి ప్రభుత్వ పాఠశాలను డీఈవో సందర్శించి సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారించాలని ఉపాధ్యాయులు సైతం విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించే విధంగా చూడాలని కోరారు. హుజురాబాద్ పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, వసతి గృహాల్లో సమస్యలను పరిష్కరించాలని సూచించారు. సంబంధిత అధికారులు పరిష్కారం చూపని యెడల రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
