
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: యాదవ కులస్తుల ఆరాధ్య దైవం బీరన్న-కామరతిల కళ్యాణం ఉత్సవానికి సోమవారం మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలతో హాజరయ్యారు. ఈ సందర్భంగా బీరన్న కళ్యాణోత్సవాన్ని జరిపిస్తున్న పూజారులు గావు పట్టి దేవునికి నైవేద్యం పెట్టారు. డబ్బు చప్పులతో ఊరేగింపుగా కోణాలను తీసుకొని మహిళలు బీరన్న కళ్యాణానికి హాజరయ్యారు. సాంప్రదాయబద్ధంగా కళ్యాణ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం అధ్యక్షులు బద్దుల రాజ్ కుమార్ యాదవ్, కౌన్సిలర్ మక్కపల్లి కుమారస్వామి, ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరేణి సమ్మయ్య, తొర్రి చిన్న సమ్మయ్య, భాషబోయిన సదానందం, ఓదెలు, గండ్రకోట రమేష్, గండ్రకోట సారయ్య, మక్కపెల్లి రమేష్ , భాషబోయిన రాజ కొమురయ్య, సింగరేణి రవి, తొర్రి అశోక్, జక్కుల రాజు, లెంకలపల్లి కుమార్, నవీన్, రవి, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.