
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని కరీంనగర్ రోడ్ లోని శాంతా కాలేజ్ పక్కన అక్రమంగా నిర్మించిన కట్టడాన్ని సోమవారం డిస్ట్రిక్ట్ ట్రాన్స్ ఫోర్స్(డిటిఎఫ్) సూచనల మేరకు కూల్చివేసినట్లు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ సల్వాది సమ్మయ్య తెలిపారు. పురపాలక సంఘ పరిధిలోని, కరీంనగర్ రోడ్డు, శాంత కాలేజి ప్రక్కన, సర్వే నెం. 24/A లో అనుమతులు పొందకుండా అక్రమంగా అనధికారకంగా నిర్మించిన రెండు షెడ్డులను తొలగించమని పలుమార్లు నోటీసు ఇచ్చినను తొలగించకపోవడంతో సోమవారం పోలీసుల బందోబస్తు మధ్య జేసిబి తో కూల్చి వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమoలో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిని అశ్విని గాంధీ, సిబ్బంది బాబు, శ్రీను, పోలీస్ లు తదితరులు పాల్గొన్నారు.
