
- పరకాల అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్సీ పట్టభద్రుల కాంగ్రెస్ కో ఆర్డినేటర్ వోడితల ప్రణవ్
–పదవులు లేనప్పుడే ప్రజా సంక్షేమం కోసం మల్లన్న తపన
పరకాల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్సీ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ కో- ఆర్డినేటర్ వోడితల ప్రణవ్
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హనుమకొండ:
ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తి తీన్మార్ మల్లన్న అని, ఎలాంటి పదవులు లేకున్నా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజా సమస్యలను గొంతేతి వినిపిస్తున్న వ్యక్తి తీన్మార్ మల్లన్న అని పరకాల అసెంబ్లీ
నియోజకవర్గ ఎమ్మెల్సీ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ కో-ఆర్డినేటర్ వోడితల ప్రణవ్ అన్నారు. సోమవారం పరకాల అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశంలో వోడితల ప్రణవ్ హాజరై మాట్లాడారు. ప్రజా సమస్యలపై సంపూర్ణ అవగాహన కలిగిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న భారీ మెజార్టీతో గెలిపించి శాసనమండలికి పంపించాలన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలు ఏ విధంగానైతే పనిచేశారో అదేవిధంగా మల్లన్న గెలుపు కోసం ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. పనిచేసిన వారికి కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం ఉంటుందని, రానున్న రోజుల్లో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఫలితం దక్కుతుందన్నారు. పట్టభద్రుల హక్కుల కొరకు నిరుద్యోగుల సమస్యలపై శాసనమండలిలో గొంతు ఎత్తి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. గత ప్రభుత్వాలు ఎన్నో ఇబ్బందులకు గురిచేసిన వాటిని తట్టుకొని ప్రజల పక్షాన నిలిచిన ఏకైక వ్యక్తి తీన్మార్ మల్లన్న అని, అలాంటి వ్యక్తిని శాసనమండలికి పంపించినట్లయితే అందరికీ న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈనెల 27న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ లో అనుసరించవలసిన విషయాలపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.

