
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
ప్రపంచ శాంతి కామకుడు బుద్ధుడు 2568వ జయంతినీ హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గురువారం ఘనంగా నిర్వహించారు. ప్రపంచ జ్ఞానాన్ని, సత్యశోధకులు గౌతమ బుద్ధుడు క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో ఇదే రోజున జన్మించాడన్నారు. ముందుగా చౌరస్తా వద్ద బుద్ధుని విగ్రహానికి పూలమాలవేసి సంధ్యల వెంకన్న బుద్దిస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అనంతరం వెంకన్న మాట్లాడుతూ మానవజాతికి ఆధునిక ప్రపంచానికి సరిపోయేది బౌద్ధమే అన్నారు. ప్రపంచాన్ని రక్షించగల శక్తి ఒక బౌద్ధానికి మాత్రమే ఉందనీ, దాస్య విమోచన దుఃఖ నిరోధం మానవతా విలువల వైపు నడిపించేది బౌద్ధం మాత్రమే అని చెప్పారు. బోధిసత్వ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బౌద్ధం సద్దమ్మతో కూడిన సన్మార్గం అని, సమాజాన్ని సంస్కరించే ఒక సామాజిక వాదం మానవుని విచక్షణ వికాసం విజ్ఞానం అన్నారు. శాస్త్రీయతతో కూడిన మానవతావాదం పకృతి నియమాన్ని సమతుల్యపరిచి విశాంతరలంలోని ప్రాణులన్నింటికీ శాంతిని ఆనందాన్ని కలిగించే ఒక జీవన విధానం అన్నారు. మనుషులలో ద్వేశాలను తొలగించి మనుషులను సద్గుణాలలో సమద్దేశాలతో నింపే మనోవిజ్ఞాన శాస్త్రమే బౌద్ధ ధర్మం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంధ్యల వెంకన్న అధ్యక్షత వహించగా, సొల్లు బాబు , వేల్పుల రత్నం, అంబేద్కర్ ఓదేలు, మోరే సతీష్, రామ్ రాజేశ్వరరావు, మానవ వికాస వేదిక రాష్ట్ర కార్యదర్శి రొంటాల బుచ్చయ్య, ఎరుకలగూడెం సమ్మన్న, కనుకులగిద్దే సమ్మన్న, సిర్సపల్లి కొమురయ్య, ఏనూరి అశోక్, గాంధీనగర్ స్వామి, గాంధీనగర్ కొమురయ్య తదితరులు పాల్గొని వచ్చే జయంతి నాటికి శాశ్వత విగ్రహాన్ని నెలకొల్పడానికి కృషి చేస్తామని వాగ్దానం చేశారు.