
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
జమ్మికుంట మండలం బిజిగీర్షరీఫ్ గ్రామంలోని హజ్రత్ సయ్యద్ ఇంకుషావలి దర్గా కమిటీ కోశాధికారి మొహమ్మద్ మహమూద్ (48) పక్షవాతం, కిడ్నీ సంబంధిత వ్యాధితో హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో గత నెల రోజుల నుంచి చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారూ۔ ఈ సందర్భంగా దర్గా ముతవల్లి మొహమ్మద్ అక్బర్ అలీ, దర్గా కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ ఇక్బాల్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులు వారి కుటుంబానికి ప్రగడ సానుభూతి తెలియజేశారు. మహమూద్ దర్గా కమిటీకి చేసిన సేవలను పలువురు కొనియాడారు.