ఇసుక క్వారీలను కోర్టు నిలిపివేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన తుమ్మేటి..!

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:

మానేరు పరివారక ప్రాంతంలో ఇసుక క్వారీలను నిలిపివేయాలని మరియు అధికారులపై జరిమానా విధిస్తూ ఇచ్చిన ఎన్జిటి కోర్టు తీర్పు స్వాగతిస్తూ ఉత్తర్వులు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులు ప్రజలు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుమల రేవంత్ రెడ్డిని సమ్మిరెడ్డి విజ్ఞప్తి చేయాగా, బిఆర్ఎస్ ప్రభుత్వంలో మానేరు పరివాహక ప్రాంతంలో ఇసుక రవాణా నిలుపుదల కోసం ప్రజాస్వామ్య పోరాటాలు చేసిన అనేకమంది రైతులపైన యువకులపైన అక్రమ కేసులు బనాయించారన్నారు. కరీంనగర్ మాజీ మంత్రి గంగుల కమలాకర్ అప్పటి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మరియు అవినీతి అధికారులైన కొంత మంది పోలీసులు కలిసి నానా రకాలుగా రైతులను ప్రజలను వేధించారన్నారు. ఎన్ని వేధింపుల గురించి చేసిన నిర్విరామంగా ఇసుక మాఫియాపై పోరాటం చేసిన సుధాకర్ ని సన్మానం చేయడం జరిగింది. గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు తీర్పు ప్రకారం అధికారులపై వెంటనే జరిమానా వసూలు చేసి నష్టపోయిన రైతులకు అందింపజేయాల్సిందిగా తీర్పును ఇచ్చిందన్నారు. అప్పటి రైతులపైన పెట్టిన అక్రమ కేసులపై విచారణ జరిపి వెంటనే తొలగించవలసిందిగా విజ్ఞప్తి చేయాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇక్కడి ఇసుక అక్రమ రవాణా దోపిడి పైన అక్రమ కాంట్రాక్టర్ విధానం పైన పూర్తి అవగాహన ఉందన్నారు. గతంలో పలు సందర్భాలు హుజురాబాద్ కు వచ్చిన వేళల హామీ ఇవ్వడం జరిగిందన్నారు. కాంట్రాక్టర్ల పైన ప్రభుత్వాధికారుల పైన ప్రభుత్వ ఆరోవర్ యాక్టును ఉపయోగించి అక్రమంగా ప్రభుత్వ ఖజానాకి గండి కొడుతు దోచుకున్న 1000 కోట్లను రికవరీ చేయవలసిందిగా కోరారు. చట్టపరమైన శాఖ పరమైన చర్యలు వెంటనే తీసుకోవలసిందిగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. ఈ మీడియా సమావేశంలో వారితోపాటు మానేరు పరిరక్షణ సమితి నాయకులు కంకణాల సురేందర్ రెడ్డి, ఎండి సలీం ,మైస మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!