
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ : విద్యార్థి దశలో లక్ష్యంపై దృష్టి సారించి, సత్ప్రవర్తనతో మెలగాలని మండల విద్యాధికారి విడపు శ్రీనివాస్ సూచించారు. మంగళవారం చెల్పూర్ ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో ‘బేటీ బచావో – బేటీ పఢావో’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.




ఈ సందర్భంగా మహిళా సాధికారత కేంద్రం (WCD & SC) జెండర్ స్పెషలిస్ట్ ఇరుగంటి శైలజ మాట్లాడుతూ.. విద్యార్థినులు ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’పై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని, ఆపద సమయాల్లో ధైర్యంగా ఫిర్యాదు చేయాలని తెలిపారు. సెల్ఫోన్లు, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం బాలల హక్కుల పరిరక్షణ విభాగం సోషల్ వర్కర్ మాడుగుల రమేష్ మాట్లాడుతూ.. బాలురు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఆపద వేళల్లో ఉచిత సహాయవాణి ‘1098’ను సంప్రదించాలని కోరారు.
కార్యక్రమంలో ఉన్నత పాఠశాల హెచ్ఎం ఇనగంటి అనురాధ, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం కె.రమాదేవి, సీఆర్పీలు రమేశ్, సుధామన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
@@లోకల్ యాడ్స్@@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ బానోతు వెంకట్ స్వామి నాయక్ గారు, 15వ వార్డు కౌన్సిలర్, పురపాలక సంఘం హుజురాబాద్.




