
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్:
స్థానిక రైతు వేదిక నందు మంగళవారం రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ ప్రత్యేక కార్యక్రమంతో పాటు, వ్యవసాయ శాఖ మరియు కె.వి.కె (KVK) జమ్మికుంట ఉమ్మడి ఆధ్వర్యంలో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రోంటాల సుహాసిని, సహాయ వ్యవసాయ సంచాలకులు (ADA) G. సునీత, కెవికె శాస్త్రవేత్త ప్రశాంతి ముఖ్య అతిథులుగా హాజరై రైతులకు పలు సూచనలు చేశారు.
సమతుల్య ఎరువులతోనే నేల ఆరోగ్యం – G. సునీత (ADA, హుజూరాబాద్ డివిజన్):
రైతులు రసాయన ఎరువులపైనే ఆధారపడకుండా సమతుల్య ఎరువుల వినియోగాన్ని పెంచాలని, తద్వారా నేలల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. నీటి సంరక్షణను ప్రోత్సహిస్తూ, సుస్థిర పోషక యాజమాన్య పద్ధతులు మరియు సహజ వ్యవసాయాన్ని వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఎల్ నినోను తట్టుకునే పంటల ఎంపిక తప్పనిసరి – ప్రశాంతి (KVK శాస్త్రవేత్త):
‘ఖేత్ బచావో అభియాన్’ ముఖ్య ఉద్దేశం భావి తరాలకు ఆరోగ్యకరమైన నేలలను అందించడమేనని తెలిపారు. ప్రస్తుత ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు యాసంగి సాగుకు ముందు తమ వద్ద ఉన్న నీటి వనరులు, నేల స్వభావాన్ని అంచనా వేసుకోవాలని చెప్పారు. పంటల సరళి, విత్తే సమయం, పంట కాలపరిమితిని పరిగణనలోకి తీసుకొని అధికారుల సలహాల మేరకు మాత్రమే పంటలు, ఎరువులను ఎంపిక చేసుకోవాలని సూచించారు.
నష్టపోకుండా జాగ్రత్త పడాలి – సుహాసిని (మున్సిపల్ చైర్పర్సన్):
వాతావరణ మార్పులు, ఎల్ నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సాగునీటి యాజమాన్య పద్ధతులు పాటించాలన్నారు. అధికారుల మార్గదర్శకాలను పాటిస్తూ పెట్టుబడి పెట్టి నష్టపోకుండా రైతులు తగిన జాగ్రత్తలు వహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సెరికల్చర్ ADA వెంకన్న, AO భూమిరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు బోరగల్ల సమ్మయ్య, సొళ్ళు సునీత, కో-ఆపరేటివ్ శాఖ అధికారులు, AEOలు, PACS CEOలు, హుజూరాబాద్ FPO ప్రతినిధులు మరియు నియోజకవర్గ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
&&లోకల్ యాడ్స్&&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ బానోతు వెంకట్ స్వామి నాయక్ గారు, 15వ వార్డు కౌన్సిలర్, పురపాలక సంఘం హుజురాబాద్.




