
మండల యాదగిరి,స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ :హుజురాబాద్ పట్టణంలో ఈనెల 1న నిర్వహించనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యాధికారి విడపు శ్రీనివాస్ తెలిపారు. పరీక్ష కోసం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ పాఠశాలల్లో రెండు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉన్నత పాఠశాల కేంద్రంలో 191 మంది, జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ కేంద్రంలో 191 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారనీ ఆయన అన్నారు.





