
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : ఆర్టీసీ ఉద్యోగిగా విధులు నిర్వహించి రిటైర్డ్ అవుతున్న ఆర్టీసీ ఉద్యోగి ఊకంటి రాములు సేవలు అమోఘమైనవని డిఎం దయాకర్ ప్రశంసించారు. స్థానిక ఆర్టీసీ డిపోలో జరిగిన కార్యక్రమంలో శనివారం రిటైర్డ్ అవుతున్న ఊకంటి రాములును ఆర్టీసీ అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాములు ఆర్టిసి ఉద్యోగీగా సంస్థ ఉన్నతికి ఎంతో పాటుపడ్డాడని కొనియాడారు. దీంతోపాటు కంట్రోలర్ గా ప్రయాణికులకు ఓపికతో సమాధానాలు ఇస్తూ వారి అభిమానాన్ని చురగొన్న రాములు సేవలు మర్చిపోమన్నారు. ఈ కార్యక్రమంలో AMT అంజలి, సమ్మయ్య, శివాదాయల్ సింగ్, మ్యాడ రమేష్, గొర్రె రమేష్ తదితరులు పాల్గొన్నారు.





