
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (సింగాపురం): విఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో కమల ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు, కెప్టెన్ వొడితల లక్ష్మీకాంతరావు 89వ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ టి.అజయ్ కుమార్ ఆధ్వర్యంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు కలిసి కేక్ కట్ చేసి కెప్టెన్ వొడితల లక్ష్మీకాంతరావు కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ టి. అజయ్ కుమార్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.




