
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి
హుజురాబాద్ : నిరుపేదలు, వృద్ధులు, వితంతువులు మరియు దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు పేర్కొన్నారు. బుధవారం హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల లబ్ధిదారులకు ఆమె వార్డు కౌన్సిలర్ సొల్లు సునీత బాబుతో కలిసి పింఛన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.


ఈ సందర్భంగా చైర్ పర్సన్ సుహాసిని మాట్లాడుతూ… అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, పింఛన్ల ద్వారా వృద్ధులు, ఒంటరి మహిళలు ఆత్మగౌరవంతో జీవించే అవకాశం కలుగుతోందని అన్నారు. 5వ వార్డు కౌన్సిలర్ సొల్లు సునీత బాబు మాట్లాడుతూ… వార్డులో అర్హులైన వారందరికీ పింఛన్లు అందేలా నిరంతరం కృషి చేస్తున్నామని, వార్డు అభివృద్ధికి సహకరిస్తున్న చైర్ పర్సన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పింఛన్ పత్రాలు అందుకున్న లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్, హనుమాన్ దేవాలయం చైర్మన్ కొలిపాక శంకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, 5వ వార్డు ప్రజలు మరియు పింఛన్ లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
&&లోకల్ యాడ్స్&&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. మీ డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ…

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు : శ్రీ గాలి రాకేష్ నేత గారు, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా నాయకుడు, హుజురాబాద్.




