
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, నవంబర్ 18: హుజూరాబాద్ మండల పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి, రైతులు పండించిన ధాన్యాన్ని ఎలాంటి జాప్యం లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ హుజూరాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించి ఎమ్మార్వో నరేందర్ కి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బీజేపీ హుజూరాబాద్ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు మాట్లాడుతూ, రైతులు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తుఫాన్ ప్రభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ధాన్యం తడిసిపోకుండా అధికారులు ముందస్తు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన గన్నీ బ్యాగులు, తూకం యంత్రాలు, ఇతర సౌకర్యాలను అందుబాటులో ఉంచాలని, రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద వేచి ఉండే పరిస్థితిని నివారించాలని అన్నారు.
రైతుల సంక్షేమమే దేశ సంక్షేమమని, రైతులకు అన్యాయం జరిగితే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. రైతుల సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో రైతుల పక్షాన పార్టీ ఆధ్వర్యంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
రైతులకు న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన నిలబడి పోరాటంకొనసాగిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు పట్టణ మాజీ అధ్యక్షులు గంగ్గిశెట్టి రాజు పట్టణ ప్రధాన కార్యదర్శి తిప్పబతినీ రాజు పట్టణ ఉపాధ్యక్షులు యాళ్ల సంజీవరెడ్డి ఎస్సీ మోర్చా అధ్యక్షులు ఎర్ర శ్రీధర్ ఓబిసి మోర్చాఅధ్యక్షులు కొలిపాక వెంకటేష్ పట్టణ కార్యదర్శి గుర్రం సంతోష్ కొడిమ్యాల పవన్ బోడిగ రాద కొలుగూరి అనిల్ కోశాధికారి క్యాస వెంకటేస్ సీనియర్ నాయకులు నరాల రాజశేఖర్ యాంసాని శశిధర్ అంకతి వాసు బోరగాల సారయ్య కురిమిళ్ళ శ్రీధర్ బూత్ అధ్యక్షులు డోరి అయిలయ్య ఆవుల సదయ్య చతర్ సింగ్ పోలోజు కిరణ్ పర్ధం విజయ్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
##లోకల్ యాడ్స్##
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. మీ డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ…

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు : శ్రీ గాలి రాకేష్ నేత గారు, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా నాయకుడు, హుజురాబాద్.




