Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ ఆదేశాల మేరకు తల్లిదండ్రులు మరియు అధ్యాపకుల ఆత్మీయ సమావేశం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థుల తల్లిదండ్రులు భారీ సంఖ్యలో హాజరై కళాశాల విద్యా ప్రమాణాలపై తమ సంతృప్తిని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ, ప్రైవేటు కళాశాలలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాణ్యమైన విద్య అందుతోందని కొనియాడారు. తమ పిల్లలు ఈ కళాశాలలో చదవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని, కళాశాల వాతావరణం, బోధనా పద్ధతులు ఎంతో బాగున్నాయని ఉన్నది ఉన్నట్లుగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ కళాశాలలో అందుతున్న సౌకర్యాలు, అధ్యాపకుల ప్రోత్సాహం మరియు తమ విద్యా అనుభవాలను తల్లిదండ్రుల ముందు చక్కగా వివరించడంతో వారంతా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.
అనంతరం అధ్యాపకులు మాట్లాడుతూ, విద్యార్థుల విద్యాభివృద్ధికి సబ్జెక్టుల వారీగా ప్రత్యేక సూచనలు, సలహాలు అందించారు. క్రమశిక్షణతో చదివి రాబోయే పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి : ప్రిన్సిపాల్ సుగుణ
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి సుగుణ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ కళాశాలల బలోపేతానికి ఎంతో కృషి చేస్తోందన్నారు. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్, షూస్, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, బ్యాడ్జీలతో పాటు స్కాలర్షిప్లను ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో విద్యార్థుల ఆకలి తీర్చేందుకు టిఫిన్స్ మరియు మధ్యాహ్న భోజనం (మిడ్-డే మీల్స్) కూడా అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. ప్రభుత్వ కల్పిస్తున్న ఈ అద్భుతమైన అవకాశాలను ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలకు అందేలా చూసుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో భాగంగా గత విద్యా సంవత్సరంలో కళాశాలలో అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ కనబరిచిన విద్యార్థుల పేర్లను ప్రిన్సిపాల్ ప్రకటించారు. ప్రభుత్వ కళాశాల విద్యార్థులు సాధించిన ఉత్తమ ఫలితాలను తెలుసుకున్న తల్లిదండ్రులు హర్షధ్వానాలు, కరతాళ ధ్వనులతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు ప్రసాద్, తులసీదాస్, విజయేందర్ రెడ్డి, వాసు, మురళీమోహన్, మల్లారెడ్డి, రాజేశం, రేణుక, రాజశేఖర్, సురేష్, శైలజ, రామ్ రాజు తదితర అధ్యాపక బృందంతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.
@@లోకల్ యాడ్స్@@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. మీ డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ…

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు : శ్రీ గాలి రాకేష్ నేత గారు, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా నాయకుడు, హుజురాబాద్.




