
-నియామకపు ఉత్తర్వులు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ మండలం వెంకట్రావు పల్లి గ్రామానికి చెందిన కన్నెబోయిన ధర్మేందర్ తెలంగాణ రాష్ట్ర స్థాయిలో బిసిల సామాజిక, రాజకీయ చైతన్యం కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నందున వారి సేవలను గుర్తించి బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మరియు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు ధర్మేందర్ ని బిసి యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ బిసి సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి గొర్ల అయిలేశ్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా కన్నెబోయిన ధర్మేందర్ మాట్లాడుతూ నాపై నమ్మకముతో నన్ను బిసి యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యకి, బిసి సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి గొర్ల అయిలేశ్ యాదవ్‌కి మరియు రాష్ట్ర నాయకులు ఎర్ర సత్యనారాయణ, నాగుల శ్రీనివాస్ యాదవ్, అనంతోజు నర్సింహాచారిలకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర స్థాయిలో బిసిల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని బిసిలను సంఘటిత పరిచి చట్టసభల్లో బిసిలకు రిజర్వేషన్ల సాధన కోసం ఉద్యమిస్తామని తెలిపారు.