
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ధర్మపత్ని, మహాసాధ్వి, త్యాగశీలి రమాబాయి అంబేద్కర్ 89వ వర్ధంతి కార్యక్రమం హుజరాబాద్ లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర అంబేద్కర్ జయంతి కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు,
ఈ కార్యక్రమంలో ముందుగా రమాబాయి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలతో, కొవ్వొత్తులతో ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ రమాబాయి అంబేడ్కర్ తన జీవితాన్ని సమాజం కోసం త్యాగం చేసి అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచి ఆయన విదేశాలలో చదువుతున్నప్పుడు తాను కష్టపడి సంపాదించిన మొత్తాన్ని అంబేద్కర్ కు పంపించి సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం అయిందన్నారు. తన పిల్లలను కోల్పోయినప్పటికీ మనోధైర్యంతో దేశంలోని పిల్లల భవిష్యత్తు కోసం అంబేద్కర్ కు పూర్తి సహాయాన్ని అందించిన గొప్ప మహిళా అన్నారు. ఈ సందర్భంగా ఆమె సేవలను గుర్తు చేసుకొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, అంబేద్కర్ జయంతోత్సవ కమిటీ చైర్మన్ మహమ్మద్ ఖలీద్ హుస్సేన్, దళిత బహుజన నాయకులు వేల్పుల రత్నం, చందుపట్ల జనార్ధన్, పట్టణ కాంగ్రెస్ నాయకులు సొల్లు బాబు, హుజురాబాద్ జిల్లా సాధన సమితి చైర్మన్ భీమోజు సదానందం, బాబు జగ్జీవన్ రామ్ జయంతి కమిటీ అధ్యక్షుడు రొంటాల సుమన్, పూలే జయంతి కమిటీ చైర్మన్ ఉప్పు శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు రుద్రారపు రామచంద్రం, మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు తునికి వసంత్, నాయకులు దాట్ల ప్రభాకర్, కొలిపాక శంకర్, మాడుగుల ఓదెలు, రామ్ సారయ్య , మొలుగు రమేష్, తిరునహరి రమేష్, ఎర్ర రాజ్ కుమార్, ఏనుగు అశోక్, సాదుల రవీందర్ బాబు, సొల్లు సారయ్య, గాజుల సంపత్, ఎర్రబొజ్జు నారాయణ, వేల్పుల మల్లయ్య, బొరగాల సారయ్య తదితరులు పాల్గొన్నారు.
