-ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముజాహిద్
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
సమాజానికి ఏదో మంచి చేయాలని ఆలోచన కలిగిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని, అలాంటి తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప వ్యక్తిని నేడు సమాజాన్ని కోల్పోయిందని తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ శనివారం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామోజీరావుకు రెండు నిమిషాలు మౌనం ప్రకటించి వారి కుటుంబానికి సంతాపం తెలిపారు. రామోజీరావు తన ఆలోచనలలోను డైరీలో రాసుకునేవారని, రామోజీరావు ప్రజలలో చైతన్యం తీసుకుని వచ్చిన గొప్ప వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారన్నారు. రామోజీరావు మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని, ప్రజలు రామోజీరావు ఒక వ్యక్తి కాదు శక్తి అని, ఏ రాష్ట్రంలో అయినా తుఫాన్ వచ్చి ప్రజలు నష్టపోయిన వారికి ఈనాడు పత్రిక ద్వారా విరాళాలు వసూలు చేసి ఆ గ్రామాలలోకి వెళ్లి వారికి సహాయం చేసిన గొప్ప మనసున్న వ్యక్తి రామోజీరావు అని మహమ్మద్ ముజాహిద్ తెలిపారు. ఎన్నో వికలాంగుల సంస్థలకు తనకు తోచిన సహాయం చేసిన వ్యక్తి రామోజీరావు అని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ పేర్కొన్నారు. తుఫాన్ వచ్చి నష్టపోయిన కుటుంబాలకు తన వంతు విరాళాలు వసూలు చేసి నష్టపోయిన ప్రజలకు గృహాలు నిర్మించి, వారికి అందజేసిన వారిలో ఒక రామోజీ రావే మొదటి స్థానంలో నిలుస్తారని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు. చిత్ర పరిశ్రమకు ఎన లేని సేవలు చేశారనీ, తెలుగు జాతి గొప్ప వ్యక్తి ని ఈరోజు మన మనందరి వద్ద లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అన్నారు. రామోజీరావు మరణం పట్ల ప్రగాఢ సంతాపం మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు. రామోజీరావు మరణం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో తీరని లోటు అని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు.