–ఉద్యమకారుల ఫోరం జిల్లా చైర్మన్ కనకం కుమారస్వామి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను తక్షణమే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా చైర్మన్ కనకం కుమారస్వామి డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో మీడియా సమావేశానికి కరీంనగర్ జిల్లాకు చెందిన వివిధ మండలాల ఉద్యమకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల భూమితో పాటు వారి అభివృద్ధికి తోడ్పడుతామని హామీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ హామీ మేరకు తెలంగాణ ఉద్యమకారులు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు తమ సయశక్తుల గెలిపించడానికి కృషి చేయడం జరిగిందన్నారు. వివిధ ఎన్నికల కోడ్ కారణంగా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేకపోయారని, ప్రస్తుతం ఇప్పుడు రాష్ట్రంలో కోడ్ లేదు కాబట్టి తెలంగాణ ఉద్యమకారులకు వారి అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 250 గజాల భూమి, 25 వేల పెన్షన్, సంక్షేమ పథకాల్లో అవకాశాలు మరియు తెలంగాణ ఉద్యమకారుల ఎంపిక కమిటీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణ ఉద్యమకారుల లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరరు. గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలు ఉద్యమంలో 10 సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా తెలంగాణ ఉద్యమకారులకు ఆత్మగౌరవం గానీ సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో గాని ఎక్కడ కూడా చోటు ఇవ్వలేని, బిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలం తెలంగాణ ఉద్యమకారులకు ఎటువంటి ప్రయోజనం లేకుండా కేవలం త్యాగాలకే పరిమితం కావడం జరిగిందన్నారు. కానుక తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియ వేగవంతం చేయాలని వీలైనంతవరకు త్వరగా ఉద్యమకారులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమకారులకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో 250 గజాల భూమి ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండలాల అధ్యక్షులు సంజీవ్, సదానందం, అంకుష్ ,హర్షవర్ధన్ రెడ్డి, జిల్లా నాయకులు చంద్రమౌళి, శంకరయ్య, మొగిలి, మామిడి, కూనమల బాపురెడ్డి, మల్లేశం, రాష్ట్ర నాయకులు భోగి పద్మ, అయిల ప్రసన్న, మునక్కా భాగ్యలక్ష్మి, పోగుల కవిత, కసికొండ శారద, గాలి కవిత, బాలమణి, సోడె పద్మావతి, కూన మల్లేశ్వరి, దేవేంద్ర తదితర ఉద్యమకారులు పాల్గొన్నారు.