-గోల్డెన్ జూబ్లీ వేడుకలను జరుపుకున్న విద్యార్థులు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజరాబాద్ పట్టణంలోని స్థానిక క్లబ్ లో ఆదివారం ఎస్.ఎస్సి 1974 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం, గోల్డెన్ జూబ్లీ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ 1974 ఎస్.ఎస్.సి బ్యాచ్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత (హైస్కూల్) పాఠశాలలో విద్యనభ్యసించారు. అలాగే ఇదే బ్యాచ్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యను 1974 – 1976 విద్యా సంవత్సరంలో విద్యను పూర్తి చేశారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కళాశాలకు ప్రిన్సిపాల్ గా ఆర్ దేశ్ ముఖ్ అప్పుడు పని చేసేవారు. ఆ కాలంలో ఉన్నత పాఠశాలలో భయం, భక్తి ప్రేమతో విద్య నేర్పేవారని విద్యార్థులు తెలిపారు. గురువులు విద్యతో పాటు ఎన్.సి.సి ఎన్ఎస్ఎస్, స్కౌట్, క్రీడలలో కూడా తమను ప్రోత్సహించే వారిని విద్యార్థులు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా బాల్యంలో చేసిన చిలిపి స్మృతులను గుర్తు చేసుకుంటూ తలుచుకున్నారు. 50 సంవత్సరాల క్రితం విద్యను అభ్యసించడానికి ఉన్నత పాఠశాలకు వెళితే ఎంతో సాధారణంగా, క్రమశిక్షణతో పాటు సరైన విద్యను మాకు అందించిన గురువులు మాకు మార్గదర్శకులుగా నిలిచారని విద్యార్థులు తెలిపారు.
అలాగే 1974 సంవత్సరం లో ఎస్ఎస్.సి పూర్తిచేసుకుని పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించామని తెలిపారు. మాకు ఇంటర్మీడియట్ విద్యలో ఎంపీసీ, బైపీసీ, సిఇసి, హెచ్ఇసి మొదలైన కోర్సులు ఉండేవని విద్యార్థులు గుర్తు చేసుకున్నారు. అప్పటి కాలేజీ లెక్చరర్ అయిన సి. వీరయ్య, కిషన్ రావు, ఈదారెడ్డి, మురళీధర్ రావు తదితరులు లెక్చరర్లుగా కళాశాలలో మాకు విద్య నేర్పారని వారు తెలిపారు. అధ్యాపకుల కృషితో వారు చెప్పిన పాఠాలను సక్రమంగా వింటూ సరైన నడవడికతో, మంచిగా విద్యను అభ్యసించి విద్యార్థుల అందరము ఉత్తీర్ణులైనమని వారు తెలిపారు. వారి విద్యా బోధన వల్లే విద్యార్థులమైన మేము ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాలను పొందినమన్నారు. మాకు అధ్యాపకులే మార్గదర్శకులుగా ఉండడం ద్వారా మేము కూడా ప్రభుత్వ పాఠశాలలో టీచర్లుగా ఉద్యోగాలను పొంది మా గురువులకు ఆదర్శంగా నిలిచామని వారు తెలిపారు. గురువుల విద్యా బోధన ద్వారా విద్యార్థులమైన మేము వివిధ విషయాలలో, వివిధ ఉన్నత రంగాలలో నిష్ణాతుల మైనామని విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తమకు విద్య నేర్పిన గురువులను పూలదండలతో సన్మానించి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎర్రం నారాయణరెడ్డి, సబ్బని శివాజీ, మంచికట్ల వెంకటరాజం, మేకల రాజిరెడ్డి, కల్లెపు రవీందర్ రావు, మోకిలా రాజేందర్, భీమోజు సదానందం, డి ఉపేందర్, కొత్త అశోక్ రెడ్డి, బెల్లి రాజయ్య, గంగాధర్, వి వెంకటేశ్వరరావు, అంగీరస రాజేంద్రప్రసాద్, కొమురవెల్లి సుధాకర్, సాదుల రవీందర్, మంచికట్ల రామ్మూర్తి, కే కృష్ణకుమార్, జున్నుతుల రంగారెడ్డి తదితర విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులతో పాటుగా ఆనాటి అధ్యాపకులైన సి వీరయ్య, కిషన్ రావు, ఈదారెడ్డి తదితరులు పాల్గొన్నారు.