
స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్:
ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు మృతిచెందిన ఘటన అక్కన్నపేటలో సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్కన్నపేట రోడ్డుపై ఎదురుగా వస్తున్న స్కూటీని ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మరణించగా రోడ్డు పక్కన ఉన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. తమకు న్యాయం చేయాలంటూ మృతుల కుటుంబాలు ఆందోళన దిగారు.
