
మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి కరీంనగర్:
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మానకొండూర్ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదినాన్ని పురస్కరించుకుని హుజూరాబాద్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఆయనని కలిసి నోట్ బుక్స్ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వైద్య వృత్తిలో ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగి మానకొండూర్ నియోజకవర్గ ప్రజలకు ఎనలేని సేవలు అందిస్తున్నాడన్నారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి వచ్చి నియోజకవర్గ అభివృద్దే ద్యేయంగా అనునిత్యం ప్రజలతో మమేకమై నేడు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల మన్ననలు పొందుతున్నాడన్నారు. అటు డాక్టర్ గా ఇటు ఎమ్మెల్యే గా సేవలనందిస్తున్న డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఇంకా ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు టేకుల శ్రవణ్, గుర్రం హరిబాబు, హరికృష్ణ, ఇప్పలపల్లి చంద్రశేఖర్, లంకదాసరి గంగరాజు, మంద భిక్షపతి, ముక్క మహేందర్ తదితరులు ఎమ్మెల్యేని కలిసిన వారిలో ఉన్నారు.
