
–ఆశీస్సులు అందించిన జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ
స్వర్ణ ఉదయం ప్రతినిధి, న్యూఢిల్లీ:
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ కుమార్ సరిగ్గా 11 గంటలకు నార్త్ బ్లాక్ లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవీ బాధ్యతల కార్యక్రమానికి హాజరైన శ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ బండి సంజయ్ కు ఆశీస్సులు అందించారు. అలాగే సహచర మంత్రి నిత్యానంద రాయ్ బండి సంజయ్ కు పూల బొకే అందించి అభినందనలు తెలిపారు.



భద్రతా కారణాల రీత్యా కార్యకర్తల అట్టహాసం, నాయకుల సందడి లేకుండా అత్యంత నిరాడంబరంగా హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతలు బండి సంజయ్ తీసుకున్నారు. అంతకు ముందు తన అధికారిక నివాసంలో బండి సంజయ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు తెలంగాణ నుండి భారీగా తరలివచ్చిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు. పూలబొకేలు, శాలువాతో సత్కరించి స్వీట్లు అందించి శుభాకాంక్షలు తెలిపిన పలువురు తెలంగాణ నేతలు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సాధారణ ప్రజల రాకతో బండి సంజయ్ నివాసం కోలాహలంగా మారింది.





