
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గంలోని ముస్లింలకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నియోజకవర్గంలోని జమ్మికుంట, వీణవంక ఈద్గాలను ఆయన సందర్శించి ముస్లిం సోదరులు కలుసుకొని బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వార్థం, అసూయ, రాగధ్వేషాలు లేని త్యాగనిరతిని వ్యాపింపజేయడమే బక్రీద్ ముఖ్య ఉద్దేశం అని చెప్పారు. ఈ కార్యక్రమములో జమ్మికుంట మున్సిపల్ చెర్మైన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు, జమ్మికుంట సింగిల్ విండో చెర్మైన్ పొనగంటి సంపత్, కౌన్సిలర్లు దయ్యలా శ్రీనివాస్, గాజుల భాస్కర్, తదితర సీనియర్ నాయకులు, ముస్లిం నాయకులు పాల్గొన్నారు.


