
–పబ్లిసిటీ కోసమే మంత్రిపై కౌశిక్ రెడ్డి ఆరోపణలు
–ఆరోపణలు చేయడం కాదు ఆధారాలుంటే తీసుకురా
–గైడ్ లెన్స్ ప్రకారమే నడుచుకుంటున్నామని ఎన్టీపీసీ స్పష్టం చేసింది..
–కాంగ్రెస్ ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తాం
–మొన్న రెడ్ బుక్, నిన్న బ్లాక్ బుక్, రేపు పింక్ బుక్ పెట్టుకో
–కౌశిక్ రెడ్డి డబ్బులు వసూలు చేసినట్లు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి...
–రైతు రుణమాఫీ చరిత్రత్మకం..!
-కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వోడితెల ప్రణవ్
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉద్యోగాల పేరా, ఇసుక మాఫియా, రైస్ మిల్లర్ల వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారని, దానికి సంబంధించిన పూర్తి ఆధారాలతో మంగళవారం ఉదయం 11 గంటలకు హుజురాబాద్ నియోజకవర్గం లోని చెల్పూర్ ఆంజనేయస్వామి వద్దకు వస్తున్నామని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా డబ్బులు తీసుకోలేదని వచ్చి ప్రమాణం చేయాలని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ఓడితల ప్రణవ్ సవాల్ విసిరారు.
సోమవారం హుజరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కౌశిక్ రెడ్డికి హుజురాబాద్ నియోజకవర్గంలో పబ్లిసిటీ కోసమే మంత్రి పొన్నం ప్రభాకర్ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఫ్లై యాష్ స్కాంలో గతంలోనే కౌశిక్ రెడ్డికి సమాధానం చెప్పామని, ఇప్పటికైనా ఆధారాలు ఉంటే తీసుకొని రావాలని ఆయన డిమాండ్ చేశారు. ఫ్లై యాష్ రవాణాలో స్కామ్ జరిగి ఉంటే ఆధారాలు మీడియా ముందుకు తీసుకురావాలి తప్పా ఆధారాలు లేకుండా నిందలు వేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పొన్నం ప్రభాకర్ ఉద్యమ నాయకుడని కౌశిక్ రెడ్డి ఉద్యమ ద్రోహి అని అన్నారు. ఫ్లై యాష్ విషయంలో రోడ్డు హైవే అథారిటీ వాళ్లు టెండర్ చేసి మరి రవాణా కొనసాగిస్తున్నారని అన్నారు. నిజంగా ఓవర్ లోడ్ తో వెళితే ఎన్టీపీసీ వద్దకు వెళ్లి అధికారులను నిలదీయాలి తప్పా ఏ సంబంధం లేని మంత్రిపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పిన అబద్ధమే అవుతుంది తప్ప నిజం కాదన్నారు. కౌశిక్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఎన్ని విమర్శలు చేసిన ఆకాశం మీద ఉమ్మినట్టే అవుతుందన్నారు. ఫ్లై యాష్ విషయంలో ఎన్ టిపిసి కూడా పూర్తి ఆధారాలు ఇచ్చిందని, ప్లైయాష్ తరలింపు కూడా గైడ్లైన్స్ ప్రకారమే నడుస్తుందని వివరణ ఇచ్చారన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రభుత్వ అధికారులను బ్లాక్ బుక్ ఉందని బెదిరిస్తున్నారని, మొన్నటిదాకా రెడ్ బుక్ అన్నారని ఇప్పుడు బ్లాక్ బుక్ అంటున్నారని ఇక మీద పింక్ బుక్కు కూడా దగ్గర పెట్టుకోమని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ మా ఎమ్మెల్యేల చిట్టా కూడా ఉందని భవిష్యత్తులో వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతి చిట్టా ఏమైనా తెలిస్తే కౌశిక్ రెడ్డి పింక్ బుక్కులో రాసుకొని ఇస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చి చర్యలకు ఆదేశించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నిటిని ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నామని ఇచ్చిన హామీలన్నీ కచ్చితంగా నెరవేర్చి తీర్చమని ధీమా వ్యక్తం చేశారు. అందులో భాగంగా ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణంతో పాటు గ్యాస్ సబ్సిడీ ఉచిత కరెంటును అందిస్తున్నామని అన్నారు. రైతులకు మాట ఇచ్చిన ప్రకారం రెండు లక్షల రుణమాఫీ అతి త్వరలోనే చేస్తున్నామని రుణమాఫీ ఒక చరిత్ర అవుతుందని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పీసీసీ మెంబర్ పత్తి కృష్ణారెడ్డి, సొల్లు బాబు, పూదరి రేణుక శివ, వేముల పుష్పలత, కొలిపాకా శంకర్, అఫ్సర్, తవుటం రవీందర్, కొల్లూరి కిరణ్, పుల్లూరు సదానందం, గుడెపు సారంగా పాణి, సాహెబ్ హుసేన్, సుశీల, రాధ, లావణ్య, దేశిని ఐలయ్య, సోల్లు బాబు నేరేళ్ళ మహేందర్ గౌడ్ కొలిపాక శంకర్ గూడూరి స్వామి రెడ్డి తౌటం రవీందర్ పిసిసి కోఆర్డినేటర్ దేశిని ఐలయ్య హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మిడిదొడ్డి రాజు లంకదాసరి లావణ్య యేముల పుష్పలత విష్ణుదాస్ వంశీదర్ రావు పొడేటి బిక్షపతి తదితరులతో పాటు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.


