మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: ఓ వివాహితకు అక్రమ సంబంధం అంటగట్టి సూటి పోటీ మాటలతో వేధించడంతో భరించలేక బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని
ఇప్పల్ నర్సింగాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. దీంతో మంగళవారం నా భార్య అఖిల ఆత్మహత్యకు కారణమైన ముగ్గురిని శిక్షించాలని కోరుతూ మంగళవారం హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద అఖిల కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భర్త మోతే జలంధర్ మాట్లాడుతూ… హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని ఇప్పల్ నర్సింగాపూర్ లో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నా భార్య అఖిల పై సమీపంలో నివసించే పుట్టపాక ఉమా, గుంపుల తిరుమల, గుంపుల రాజ్ కుమారులు వచ్చి నాగరాజుతో అఖిలకు అక్రమ సంబంధాలు అంటగట్టి దూషించి భౌతికంగా దాడి చేసి గాయపరిచారని అన్నారు. దీంతో అవమానాన్ని తట్టుకోలేక నా భార్య అఖిల అదే రోజు ఇంట్లో నుండి వెళ్లిపోయి బావిలో పడి ఆత్మహత్య చేసుకుందని ఆయన ఆరోపించారు. ఆమె ఆత్మహత్యకు కారకులైన ముగ్గురిని కఠినంగా చట్టప్రకారం శిక్షించాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో రోడ్డు ఎక్కాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. కాగా పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి నచ్చజెప్పడంతో వారు ధర్నా విరమించారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి భర్త, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. స్థానిక ఏరియా ఆసుపత్రిలోని మార్చురీలో అఖిల మృతదేహం ఉంచగా బంధువులు, కుటుంబ సభ్యుల ఆరోధనలు మిన్న నంటాయి.