స్వర్ణోదయం ప్రతినిధి, చొప్పదండి:-తాము చెప్పిన చదువుతో. విద్యార్థులు జీవితంలో స్థిరపడి ఉన్నత స్థానంలోకి చేరుకున్నప్పుడే నిజమైన ఆనందం గురువులకు మిగులుతుందని, అప్పుడే చదువునేర్పిన గురువులకు గురుదక్షిణ విద్యార్థులు ఇచ్చినట్లు అవుతుందని ఉపాధ్యాయులు గోవులకొండ శ్రీనివాస్ పేర్కొన్నారు. చొప్పదండి మండల కేంద్రంలోని వీణాధరి పాఠశాలలో 1995-96 విద్యా సంవత్సరంలో పదోతరగతి చదివిన పూర్వ విద్యార్థులు ముఫై ఏళ్ల తర్వాత ఒకే చోట ఆ నాటి చదువునేర్పిన ఉపాధ్యాయులతో కలిసి పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించగా పలువురిని అలరించింది. ఈ సందర్భంగా అప్పుడు బోధించిన ఉపాధ్యయులైనటువంటి గోవులకుండ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే భవిష్యత్ కు పునాదులు పడతయాన్నారు. ఇన్నాళ్ళ తరువాత అందరం ఒక్క చోట కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉన్నదన్నారు. ఈ కార్యక్రమ నిర్వహకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పూర్వ ఉపాధ్యాయులు వెంసాని రవీందర్ యాదవ్, గుర్రం శ్రీధర్ రెడ్డి, జయసింగ్, లక్మి రాజం, ప్రభాకర్, అయోధ్యo, వసంత, శారద మేడం లను ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సమ్మేళనానికి అబ్రాడ్ లో ఉద్యోగం చేస్తున్న విద్యార్థులు హాజరై పాలుపంచుకోవడం ఉపాధ్యాయులకు ఎంతో ఆనందం తెచ్చిపెట్టింది. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు శ్రీధర్, రాజశేఖర్, రామకృష్ణారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి, విజయ్, నవీన్, సుగుణాకర్ రాజు, కమలాకర్ రెడ్డి, జయాకర్, మునిందర్, రమణారెడ్డి, శేఖర్, మహేష్, సుష్మా,అర్చన, సంధ్య, స్వప్న, మునిరాణి, అరుణ, స్వప్న, రాజ్యలక్మి, పద్మప్రియ, మహేశ్వరి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
- Home
- ముప్పై ఏళ్ల తర్వాత ఒకే చోట కలిసిన పూర్వ విద్యార్థులు… ఉపాధ్యాయులను సన్మానించిన విద్యార్థులు.. విద్యార్థులు ఉన్నత స్థితిలో స్తిరపడినప్పుడే నిజమైన గురు దక్షిణ