మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ది పొందేందుకే కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల నాయకులు నాటకాలు ఆడుతున్నారని, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ అవినీతి ఆరోపణలపై సిబి సిఐడి విచారణ జరిపించాలని బిజెపి జిల్లా కార్యదర్శి, రంగాపూర్ మాజీ సర్పంచ్ కరుణాకర్ డిమాండ్ బింగి కరుణాకర్ డిమాండ్ చేశారు. హుజురాబాద్ మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎలక్షన్ల కన్నా పార్లమెంట్ ఎన్నికలలో ఎలాంటి మొదటి క్యాడర్ నాయకులు లేకున్నా భారతీయ జనతా పార్టీకి 72 వేల ఓట్లు వచ్చేసరికి కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులు స్థానిక సంస్థల్లో గెలవడం కోసం చిల్లర ఆరోపణలు చేసుకుంటున్నారని, దీనికి నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటున్నారని పేర్కొన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఫ్లై యాష్ తరలింపులో అక్రమాలు జరుగుతున్నాయని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ పై 100 కోట్లు అవినీతి ఆరోపణలు చేయడం, సంబంధిత లారీని ఆపి ఫైన్ వేయించడం, ఇందులో పోన్నం ప్రభాకర్ అవినీతి చేస్తున్నారని ఆరోపించడం జరిగిందని గుర్తు చేశారు. ఈ ఆరోపణలపై స్థానిక కాంగ్రెస్ నాయకులు ఇందులో పోన్నం ప్రభాకర్ అవినీతి లేదని లారీ యజమానులపై సంబంధిత శాఖ చర్యలు తీసుకుంటుందని ఎటువంటి ఆధారాలు లేకుండా పాడి కౌశిక్ రెడ్డి పొన్నం ప్రభాకర్ పై బురదల్లే ప్రయత్నం చేస్తున్నారని స్థానిక కాంగ్రెస్ నేతలు కౌశిక్ రెడ్డి పై ఆరోపణలు చేయడం, దీనిపై వెంటనే ముఖ్యమంత్రి స్పందించి సిబి సిఐడిచే విచారణ జరిపించాలన్నారు. దోసులు ఎవరైనా తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిరాధార ఆరోపణలైతే కౌశిక్ రెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బిజెపి తరఫున డిమాండ్ చేశారు. హుజరాబాద్ నియోజకవర్గం ప్రజలు కాంగ్రెస్- బిఆర్ ఎస్ నాటకాలతో విసిగిపోతున్నారని, గ్రామాల అభివృద్ధి పై దృష్టి పెట్టకుండా నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా ఆరోపణలు ప్రతీ ఆరోపణల ద్వారా ప్రజలను అయోమయానికి గురిచేస్తూ కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు ఆరోపణలు చేసిన కౌశిక్ రెడ్డి పైన నిరాధారమైన ఆరోపణలని అంటూ ఎటువంటి కేసులు అధికార పార్టీ నాయకులు పెట్టకపోవడం, కౌశిక్ రెడ్డి కూడా ఇవి నిజమనే ఎటువంటి రుజువులు చూపించి కేసులు పెట్టే ప్రయత్నం చేయక పోవడం కేవలం నియోజకవర్గం ప్రజలు అభివృద్ధి గురించి అడుగుతారనే భయంతో ఇద్దరు కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులు కాలం గడిపే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్ బాబు చెల్పూర్ లో ప్రమాణానికి సిద్ధమని సవాల్ విసరగా దానికి పాడి కౌశిక్ రెడ్డి ప్రతి సవాల్ చేసి ఇద్దరూ కలిసి పోలీసులతో నిర్బంధం చేసుకొని ప్రజలను అయోమయానికి గురి చేశారన్నారు. పాడి కౌశిక్ రెడ్డి తన ఇంట్లో తడి బట్టలతో స్నానం చేసి నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేయాగా అదేవిధంగా చెల్పూర్ మాజీ సర్పంచ్ నేరెళ్ల మహేందర్ గౌడ్ దగ్గర కోర్టులో జాబులు పెట్టిస్తా అని 20 లక్షలు తీసుకున్నాడని నిన్న చెల్పూర్ ఆంజనేయ స్వామి గుడిలో తడి బట్టలతో ప్రమాణం చేశాడని, కౌశిక్ రెడ్డి తన ప్రమాణంలో నేరెళ్ల మహేందర్ గౌడ్ దగ్గర నేను డబ్బులు తీసుకోలేదు అని ఎందుకు ప్రమాణం చేయలేదని సమాధానం చెప్పాలన్నారు. గతంలో కౌశిక్ రెడ్డి వ్యాపారుల, అధికారుల వద్ద, ఇసుక లారీల వద్ద డబ్బులు తీసుకున్నారని ప్రణవ్ బాబు ఆరోపణలు చేశారని దీనిపైన కౌశిక్ రెడ్డి నేను ఎవరి దగ్గర ఏలాంటి డబ్బు తీసుకోలేదు అని ఎందుకు ప్రమాణం చేయలేదో బహిరంగంగా చెప్పాలన్నారు. ఈ ప్రమాణాల వల్ల చేసిన అవినీతి మరుగున పడిపోతుందా ప్రమాణాలు చేయగానే అవినీతిపరులు నిజాయితీపరులు అవుతారా అని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో చేసిన ప్రమాణాలను చూసి ప్రజలు వీరికి ప్రమాణాలపై ఎటువంటి విజ్ఞత లేదని అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డి పై గత ఐదు సంవత్సరాలుగా నేరెళ్ల మహేందర్ గౌడ్ ఆరోపణలు చేస్తున్నాడని దీనికి కౌశిక్ రెడ్డి ఇంతవరకు ఎటువంటి సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని పేర్కొన్నారు. చెల్పూర్ మాజి సర్పంచ్ డబ్బులు ఇవ్వకపోతే ఇచ్చినది అబద్ధమని ఎక్కడ కూడా కౌశిక్ రెడ్డి మాట్లాడడం లేదని మరియు అతనిపైన న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించలేదు అంటే కౌశిక్ రెడ్డి డబ్బులు తీసుకున్నట్టు అర్థమా? అని ప్రశ్నించారు. చెల్పూర్ మాజీ సర్పంచ్ నేరెళ్ల మహేందర్ గౌడ్ డబ్బులు ఇచ్చిందే నిజమైతే కౌశిక్ రెడ్డి పై ఇంతవరకు ఏ పోలీస్ స్టేషన్లో ఎందుకు ఫిర్యాదు చేయలేదనీ, అతనిపైన కేసులు ఎందుకు పెట్టడం లేదో అర్థం కావడం లేదన్నారు. ఈ విషయంలో ప్రజలను అయోమయానికి గురి చేస్తూ నియోజకవర్గ అభివృద్ధిని ఇటు కాంగ్రెస్ అటు బిఆర్ ఎస్ గాలికి వదిలేసాయని కర్ణాకర్ ఆరోపించారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో అనేక సమస్యలు తీష్ట వేస్తున్నప్పటికీ వాటిని పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడని, గ్రామాల్లో పారిశుధ్యం లోపించిందని, వీది లైట్లు వెలగడం లేదని వీటి పైన ఆలోచించకుండా ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా అనవసరమైన విషయాలతో ప్రజల దృష్టిని మరలస్తున్న వీరిపై జిల్లా కలెక్టర్ న్యాయ విచారణ జరిపి దోసులపై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. ముందుగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే గత ఆరు నెలలుగా హుజురాబాద్ అభివృద్ధిపై ఏం చర్యలు తీసుకున్నాడో, రూ. 1000 కోట్లు నియోజకవర్గంకు తీసుకొస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చాడని దీనిపై ఏ ప్రయత్నం చేస్తున్నాడో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. అధికార పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి అయిన ప్రణవ్ బాబు ప్రజలు 6 గ్యారంటీలు అందక తీవ్ర ఇబ్బందులు గురి అవుతున్న వాటిపై ఎటువంటి సమీక్ష చేయడం లేదని, చాలా మందికి గ్యాస్ సబ్సిడీ అర్హులలో 25 శాతం మందికి కూడా అందడం లేదనీ, జీరో కరెంట్ బిల్ అర్హులకు చాలామందికి ఇప్పటికీ రావడం లేదని, దళిత బంద్ రెండో విడత రాక చాలామంది దళితులు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వీటిపై పేద ప్రజలు ఇప్పటికీ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని కరుణాకర్ ఆరోపించారు. దీనిపైన స్పందించి ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన బిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ప్రజలను, ప్రజల సమస్యలను గాలికి వదిలి అనవసరమైన విషయాలపై రాద్ధాంతం చేస్తుండడాన్ని బిజెపి తీవ్రంగా ఖండిస్తుందన్నారు. మీరు ఇలానే నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలివేస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ రెండు పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని భారతీయ జనతా పార్టీ తరపున గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మాసాడి ముత్యంరావు బీజేపీ మండల అధ్యక్షుడు రాముల కుమార్ మర్రి రవీందర్ మండల ఉపాధ్యక్షుడు ఆవుల సదయ్య పసి ప్రశాంత్ 37వ బూత్ అధ్యక్షుడు సల్పల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
- Home
- స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ది పొందేందుకే కాంగ్రెస్ బిఆర్ఎస్ నాటకాలు… అవినీతి ఆరోపణలపై సిబి సిఐడి విచారణ జరిపించాలి. – బిజెపి జిల్లా కార్యదర్శి బింగి కరుణాకర్ డిమాండ్