మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కల్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంచనివ్వడం లేదని, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలతో అధికారులు చెక్కులు పంచకుండా ఆపుతున్నారని హైకోర్టులో ఇటీవల ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ వేశారు. దీనిపై చెక్కులను పంపిణీ చేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని అధికారులను ప్రశ్నించిన హైకోర్టు.. చెక్కుల పంపిణీలో ఎందుకు ఆలస్యమైందో చెప్పాలని అధికారులను హైకోర్టు ఆదేశించినట్లు తెలిసింది.
పొన్నం ప్రభాకర్ కి హై కోర్ట్ లో ఎదురు దెబ్బ..
ఈ నెల 27 వరకు చెక్కులు పంచకుంటే బౌన్స్ అయ్యే ప్రమాదం ఉందని, త్వరగా పంచడానికి అనుమతులు ఇప్పించాలని కోర్టులో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ వేయడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి అధికారులు చెక్కల పంపిణీ ఆలస్యంపై వివరణ ఇయ్యాలని ఆదేశించింది. అయితే చెక్కుల పంపిణీ నియోజకవర్గంలో అధికారుల చేతుల మీదుగా పంపిణీ చేస్తారా లేదా ఎమ్మెల్యే చేతుల మీద పంపిణీ చేస్తారా అనేది ఉత్కంఠ గా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రతిపక్ష పార్టీకి చెందిన వాడని అధికారుల చేతుల మీదుగా మాత్రమే పంపిణీ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గత ఆర్డిఓ, తాసిల్దార్లను ఆదేశించడంతో అవి సోషల్ మీడియాలో సంభాషణ వైరల్ గా మారింది. హైకోర్టు ఆదేశాలతోనైనా అధికారులు ప్రోటోకాల్ పాటించి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేస్తారా లేదా అధికారులే స్వయంగా పంపిణీ చేస్తారా! అని ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.