
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని సైదాపూర్ రోడ్ లో గల ఎస్సారెస్పీ కాలువ సమీపంలో అహల్య నగర్ వాసులను దొంగలు హడలెత్తించారు. అర్ధరాత్రి ఒంటిగంటకు ఐదుగురు దొంగలు సతీష్ అనే వ్యక్తికి చెందిన ఇంటికి వచ్చి ఆ ఇంట్లో కిరాయికున్న వారి తలుపులు బాధడం మొదలుపెట్టారు. అంతేగాక ఒకేసారి చుట్టుపక్కల ఉన్న పలువురి ఇండ్లకు గొల్లలు పెట్టి ఒక ఇంటికి తలుపులు బాదుతుండగా లోపల ఉన్న రమేష్ అనే నివాసి భార్య, పిల్లలతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అతడు వెంటనే 100కు ఫోన్ చేయగా చాలాసేపటికి ఫోన్ కలవడంతో పోలీసులు సైతం ఆలస్యంగా సంఘటన స్థలానికి చేరుకోవడంతో స్థానికులే మేలుకొని అందరూ ఐక్యంగా దొంగలపై తిరుగుబడడంతో నలుగురు పరారు కాగా ఒక వ్యక్తి పట్టుబడ్డాడు. అతడిని పోలీసులకు అప్పగించారు. అయితే దొంగలు అహల్య నగర్ కు కరెంటు సరఫరా నిలిపివేసి గంటకు పైగా స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేశారు. చేతుల్లో ఇనుపరాడ్లు, కట్టర్లు కత్తులు వెంట తెచ్చుకోగా వారిని చూసి చుట్టుపక్కల వారు భయాందోళన చెందారు. అయితే ఈ దొంగలు హిందీలో మాట్లాడుతూ కొద్ది కొద్దిగా తెలుగు మాట్లాడుతుండడంతో వారు ఇక్కడ గత కొన్ని రోజులుగా ఉంటూనే తెలుగు నేర్చుకొని ఇండ్లను పరిశీలించి ప్లాన్ ప్రకారమే చోరీకి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఒకేసారి నాలుగు గదులలో తలుపులు బాధతో చోరీ చేసేందుకు ప్రయత్నించగా ఒక గది తలుపు తెరవగా అది ఇంతకుముందే ఇల్లు ఖాళీ చేసి పోవడంతో ఏమీ లేకపోవడంతో దొంగలు పైన ఉండే మరో ఇంటికి వెళ్లి తలుపులు బాధతో రమేష్ అనే వ్యక్తి కుటుంబాన్ని తీవ్ర భయాందోళనకు గురి చేశారు. ఇలా ఈ తతంగం గంటకు పైగా కొనసాగగా అప్పటివరకు పోలీసులు గాని వేరే ఇతరులు గాని ఎవరూ రాకుండా దొంగలు జాగ్రత్త పడ్డారు. ఇదే అహల్య నగర్ లో నెల క్రితం ఓ ఆర్టీసీ మహిళా కండక్టర్ ఇంట్లో చోరీ చేసి ఆమె దాచుకున్న 50వేల నగదు బంగారు ఆభరణాలను చోరీ చేసినట్లు స్థానికులు తెలిపారు. నిత్యం హర్యానా, బీహార్, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు అహల్య నగర్ చుట్టుప్రక్కల సంచరిస్తున్నారని దీంతో ఎవరు దొంగలో ఎవరు మంచి వారు తెలియక భయాందోళన చెందుతున్నట్లు ఖాళీవాసులు తెలిపారు. ఇప్పటికైనా పోలీసులు రాత్రి వేళలో గస్తీని పెంచి దొంగతనాలను అరికట్టి ప్రజలను భయాందోళనకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అహల్య నగర్ వాసులు కోరుతున్నారు. కాగా పోలీసులు అదుపులోకి తీసుకున్న దొంగని విచారణ జరుగుతున్నట్లు తెలిసింది, అతని ద్వారా మిగతా దొంగల ఆచూకీ లభిస్తుందా లేదా వేచి చూడాల్సిందే.!


