
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలోని చేపల మార్కెట్ వద్ద ఓ యువకుడిని అందరూ చూస్తుండగా ముగ్గురు యువకులు కలిసి కారులో కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించడం కలకలం సృష్టించింది. వివరాల్లోకెళితే.. నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన సతీష్ తన భార్య కనిపించకపోవడంతో నెల రోజులకు పైగా వెతుకుతుండగా హుజురాబాద్ లో ఓ వ్యక్తితో కలిసి ఉంటుందని తెలియడంతో తన స్నేహితులతో కలిసి కారులో హుజురాబాద్ వచ్చారు. గురువారం ఉదయం చాపల మార్కెట్ వద్ద ధనుష్ అనే వ్యక్తి తన భార్యతో కనబడడంతో అతనిని కారులో ఎక్కించుకొని కరీంనగర్ వైపు వెళ్లారు. అన్నపూర్ణ చౌరస్తా నుండి పట్టణ శివారు వరకు వెళ్లగా అప్పటికే అతన్ని కిడ్నాప్ చేస్తుండగా చూసిన పలువురు ఈ విషయం పోలీసులకు సమాచారం తెలియజేశారు. దీంతో పలువురు కిడ్నాప్ కు పాల్పడిన కారును అడ్డగించి కొంత దూరం వెళ్ళాక పట్టుకున్నారు. హుజురాబాద్ పోలీసులు కిడ్నాప్ చేసిన, కిడ్నాప్ కు గురైన వారిని అదుపులోకి తీసుకొని పూర్తి వివరాలు తెలుసుకొని వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ముగ్గురు పిల్లలు ఉండగా తన భార్య సదరు వ్యక్తితో లేచిపోయి హుజురాబాద్లో సహజీవనం చేస్తుందని తన భార్యను తనతో పంపాలని బాధితులు పోలీసులను వేడుకోగా ఇరువురితో మాట్లాడి కౌన్సిలింగ్ నిర్వహించినప్పటికీ రాత్రి వరకు కొలిక్కి రాకపోవడంతో తిరిగి మరుసటి రోజు నచ్చజెప్పి ప్రయత్నించేందుకు కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో వారు వెని తిరిగి వెళ్లారు. ఈ కిడ్నాప్ విషయం పట్టణంలో దావణముల వ్యాపించడంతో కళకళము సృష్టించింది. ఏది ఏమైనా ముగ్గురు పిల్లల తల్లి ఒక యువకుడితో తన భర్తను, పిల్లను కాదని లేచిపోయి హుజురాబాద్ కు వచ్చి యువకుడితో సహజీవనం చేయడం తీవ్ర చర్చనీయంశముగా మారింది.

