
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: ప్రధాని మోది మన్ కి బాత్ 111వ ఎడిషన్ ప్రోగ్రాంను తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో బిజెపి నాయకులతో కలిసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదివారం తిలకించారు. కేంద్ర సహాయ మంత్రి హోదాలో మొదటి సారి తిమ్మాపూర్ మండలం కు విచ్చేసిన బండి సంజయ్ కుమార్ కు మండల అధ్యక్షుడు జగదీషా చారి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి. జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వర్ రెడ్డి, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు..
