
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హైదరాబాదులో మంత్రి పొన్నం ను కలిసేందుకు మంగళవారం రాగ ఆమెకు హుజురాబాద్ ప్రాంత సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఆమెను సాదరంగా ఆహ్వానించి శాలువా కప్పి పుష్ప గుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. ఆమెను కలిసిన వారిలో టీపీసీసీ ఎస్సీ సెల్ మాజీ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్, ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ దేశిని కోటి తదితరులు ఉన్నారు.







