
స్వర్ణోదయం ప్రతినిధి, న్యూఢిల్లీ: ఎన్డీఏ ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలిపోతుందని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ న్యూఢిల్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఈ ఎన్నికల్లో నైతిక విజయం ఇండియా కూటమిదేనని, ఈ ఎన్నికల్లో మతతత్వ రాజకీయాలు ఓడిపోయాయన్నారు. భారత రాజ్యాంగాన్ని సంరక్షించుకునేందుకు దేశ ప్రజలు ఓటు వేశారన్నారు. ప్రభుత్వ అహంకారాన్ని ప్రజలు ఓడించారన్నారు. ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వదలుచుకోలేదు. అందుకే పేపర్ లీకులు జరుగుతున్నాయన్నారు.






