
-ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా మంగళవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హుజురాబాద్ పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్ మాట్లాడుతూ.. పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డును కొన్ని పాఠశాలల్లో వేయడం లేదని వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకుని కోడిగుడ్డును అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పాఠశాలలో మౌళిక సదుపాయాలు కల్పించాలన్నారు. కొన్ని పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని వాటికి నూతన భవనాలు నిర్మించాలని అన్నారు. మంచి నీటి సౌకర్యం లేక విద్యార్దులు ఇబ్బంది పడుతున్నారనీ, ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో ఫిల్టర్ వాటర్ ఏర్పాటు చేయాలని, పాఠశాలలో అటెండర్, పీటీ టిచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు కల్పించి ప్రభుత్వం చేపట్టిన మన ఊరు.. మన బడి.. పథకం ద్వారా సమస్యలను పరిష్కరించి ప్రతి పాఠశాలలో ఈ పథకం వర్తించేలా ప్రభుత్వము చుడాలని వెంకటేష్ కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కేశబోయిన రాముయాదవ్, మండల అధ్యక్ష కార్యదర్శులు దోమ్మాటి వేణుగోపాల్, జూపాక శివమణి, మండల సహాయ కార్యదర్శి రాపేల్లి రోహిత్, నాయకులు సందీప్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.







