
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి స్థాపించబడ్డ టీఎన్జీవో సంఘానికి అప్పటినుండి ఇప్పటివరకు వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నారు కనుక తెలంగాణ జేఏసీ సంఘంలో తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘానికి కూడా సభ్యత్వం జేఏసీలో కల్పించాలని తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో కలసి తేలంగాణ అంతట వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న టిసిటిఎన్జీవోస్ సంఘం అధ్యక్షులు, కార్యదర్శులతో కలిసి టీఎన్జీవోస్ కేంద్ర కార్యాలయం భవనములో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర టీఎన్జీవోస్ సంఘం ఇచ్చే పిలుపును అన్ని రకాలుగా సంపూర్ణంగా మద్దతిస్తూ వారితో అడుగులో అడుగు వేసి కలిసి నడుస్తామని టీసిటీ ఎన్జీవోస్ సంఘ అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో టీఎన్జీవోస్ అధ్యక్షులుగా జగదీశ్వర్ జనరల్ సెక్రెటరీ మహమ్మద్ ముజీబ్ శాలువలతో పుష్పగుచ్చాలతో భారీ ఎత్తున సన్మానం చేసి నూతనంగా ఎన్నికైన వారికి స్వీట్స్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు జగదీష్, జనరల్ సెక్రెటరీ మహమ్మద్ ముజీబ్ లు మాట్లాడుతూ తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని, అన్ని సమస్యలపై మాట్లాడడానికి మీతో మేము కూడా కలిసి వస్తామని, ఉద్యోగుల సమస్యలు ఉన్నాట్లైతే మీ ఆధ్వర్యంలో మా సంగం దృష్టికి తీసుకొని వస్తే అన్ని రకాల సహకారాలు ఉంటాయన్నారు. మీ సమస్యల పరిష్కారం కొరకు మా వంతు కృషి చేస్తామని టీఎన్జీవోస్ అధ్యక్షులు మారం జగదీష్, మహమ్మద్ ముజీబ్ ఈ సందర్భంగా టిసిటి ఎన్జీవోస్ అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ కు హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు జరిగిన ఉద్యమంలో కూడా టిసిటి ఎన్జీవోస్ సంఘం ఎంతో ఉద్యమించిందని మాకు ప్రతిసారి కలిసి వచ్చి సంపూర్ణంగా మద్దతు ఇచ్చిన సంఘం టిసిటిఎన్జీవోస్ అని గర్వంగా ఉందని టీఎన్జీవోస్ అధ్యక్షులు మారం జగదీష్ అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు జి బిక్షపతి, ఎన్వి రమేష్, గోపి కిషోర్, జి ప్రభాకర్, ప్రవీణ్, మహమ్మద్ అఖిల్ ,హరికృష్ణ, సాయి కృష్ణ, సయ్యద్ ముజీబ్, పి శ్రీనివాస్ శర్మ, రమేష్, సయ్యద్ కుదురత్ అలీ, మహమ్మద్ ఫహీం, మహమ్మద్ అజార్, దీపక్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
