
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: మొదటి అల్పపీడనం ఈ నెల 7న ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడి 8న ఉత్తరాంధ్ర & ఉత్తర ఒరిస్సా మధ్య తీరం దాటుతుంది. దీని వలన ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ జిల్లాల్లో 7,8,9,10,11,12 తారీఖులలో వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే రెండవ అల్పపీడనం ఈ నెల 15 న వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రమైన అల్పపీడనంగా మారి, సేమ్ ఇదే రూట్ లో ప్రయాణించి 15,16,17,18 తారీఖులలో ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ అంతటా భారీ వర్షాలు పడనున్నాయి. అలాగే మూడో అల్ప పీడనం ఈ నెల 23న తూర్పు బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడి 25/26 ( సుమారుగా) వాయుగుండంగా బలపడి మధ్యాంద్ర వైపుగా వచ్చే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ మూడు అల్పపీడనాలతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు అవసరమైన వర్షపాతం నమోదు కావడమే కాక నీటి కొరతను కూడా తీర్చనున్నట్లు వాతావరణాధికారులు భావిస్తున్నారు. రైతులు, ప్రజలు అల్పపీడన సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ముందస్తుగా సూచించారు.


ఇదే జరిగితే ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ లో అత్యధిక వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉంది.